haripriya: నా సినీరంగ ప్రవేశం అలా జరిగింది: హరిప్రియ

  • స్కూల్ డేస్ నుంచే స్టేజ్ అనుభవం వుంది 
  • కాలేజ్ డేస్ లో ప్రైజ్ లన్నీ నావే 
  • నా గురించిన ఆర్టికల్ పేపర్లో వచ్చింది 
  • అదే సినిమా ఛాన్స్ తెచ్చిపెట్టింది    

అందాల కథానాయికగా పేరు తెచ్చుకున్న హరిప్రియ, తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాలు చేస్తూ వెళుతోంది. తెలుగులో కొన్ని సినిమాలు చేసిన ఆమెకి 'పిల్ల జమీందార్' .. 'జై సింహా' మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో ఐ డ్రీమ్స్ తో ఆమె మాట్లాడుతూ, తాను సినిమా రంగంలోకి ఎలా వచ్చింది చెప్పుకొచ్చింది.

" మేం 'చిక్ బళ్లాపూర్'కి 40 కిలోమీటర్ల దూరంలో ఉండేవాళ్లం. హైస్కూల్ చదువు కోసమని బెంగళూర్ వచ్చాం. స్కూల్ డేస్ నుంచి స్టేజ్ పై కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేదానిని. యాక్టింగ్ .. డాన్సింగ్ పోటీల్లోనూ పాల్గొని స్కూల్ కి చాలా ప్రైజ్ లు గెలుచుకొచ్చేదానిని. బెంగళూర్ లో కాలేజ్ ఫెస్ట్ లో ఫెర్ఫార్మ్ చేసినప్పుడు .. మరుసటి రోజు పేపర్లో ఆర్టికల్ వచ్చింది. అది చూసిన ఓ డైరెక్టర్ 'తుళు' సినిమా కోసం నన్ను సంప్రదించారు. ఒక సినిమా చేసి చూద్దామన్నట్టుగా ఓకే అన్నాను .. అలా నా సినిమా ప్రయాణం మొదలైంది" అని చెప్పింది.        

  • Loading...

More Telugu News