air india: ఎయిరిండియా విమానాన్ని ఢీ కొన్న పక్షి.. మణిపూర్ సీఎం సహా 160 మందికి తప్పిన ప్రమాదం
- గువహటి ఎయిర్పోర్టులో ఘటన
- విమానంలోని ముందు భాగం డ్యామేజ్
- చాకచక్యంగా విమానాన్ని ల్యాండ్ చేసిన పైలట్
- ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదని ప్రకటన
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బిరేన్ సింగ్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. గువహటిలోని లోక్ప్రియ గోపినాథ్ బోర్డోలోయి ఎయిర్పోర్టులో ఎయిరిండియా విమానం ల్యాండ్ అవుతుండగా దానిని ఓ పక్షి ఢీకొంది. దీంతో విమానంలోని ముందు భాగం కొంత పాడైపోయినప్పటికీ పైలట్ చాకచక్యంతో విమానాన్ని ల్యాండ్ చేశారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ విమానంలో మణిపూర్ సీఎం సహా 160 మంది ప్రయాణికులు ఉన్నారని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదని ప్రకటించారు.