Narendra Modi: ప్రధాని మోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమానికి రాహుల్ గాంధీ సలహాలు
- యువతకి ఉద్యోగాలు, డోక్లాం వివాదం, హర్యానాలో రేప్‌ల గురించి మాట్లాడాలని సూచన
- మోదీ ట్వీట్‌కి రాహుల్ గాంధీ రిప్లై
- జనవరి 28న జరగనున్న కార్యక్రమం
2018లో తన మొదటి 'మన్ కీ బాత్' కార్యక్రమంలో చర్చించాల్సిన అంశాల గురించి సలహాలు కావాలని ప్రధాని నరేంద్రమోదీ ఓ ట్వీట్ ద్వారా కోరారు. ఆయన ఇలా కోరడం ఎప్పట్నుంచో జరుగుతూనే ఉంది. కానీ ఈసారి ట్వీట్‌కి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సలహాలు ఇస్తూ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
'నరేంద్ర మోదీ గారు..మన్ కీ బాత్ కోసం మీరు సలహాలు అడిగారు కదా... ఈ అంశాలు ప్రయత్నించండి. 1. యువతకి ఉద్యోగాలు, 2. చైనాతో డోక్లాం వివాదం, 3. హర్యానాలో రేప్‌లు' అంటూ రాహుల్ గాంధీ కార్యాలయం ట్వీట్ చేసింది. అయితే రాహుల్ చెప్పిన అంశాలు కొంత వ్యంగ్యంగా ఉన్నప్పటికీ చర్చించదగ్గ అంశాలుగానే కనిపిస్తున్నాయి. మరి నరేంద్రమోదీ వీటి గురించి చర్చిస్తారో? లేదో? చూడాలి మరి!