video: 600 మీటర్ల ఎత్తున్న గాజు వంతెనను సుత్తితో కొడుతూ, వాటిపై ఎగురుతూ.. గగుర్పొడిచే రీతిలో పరీక్ష.. వీడియో!
- చైనాలోని హెక్కి నగరంలో అతి పొడవైన గాజు వంతెన
- వచ్చేనెలలో ప్రారంభించనున్న నేపథ్యంలో పరీక్ష
- వైరల్ అవుతోన్న వీడియో
గాజు వంతెనలపై నిలబడి వాటిని సుత్తెలతో కొడుతూ, వాటిపై ఎగురుతూ అది సరిగ్గా పని చేస్తుందా? అనే విషయంపై పరీక్ష చేశారు కార్మికులు. ఈ పరీక్షలు జరుపుతుండగా తీసిన వీడియో ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. చైనాలోని హెక్కి నగరంలో అతి పొడవైన గాజు వంతెనను పూర్తి చేసిన సందర్భంగా ఈ పరీక్షలు నిర్వహించారు.
ఈ వంతెనను వచ్చేనెలలో ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ ప్రయోగం చేసి ఆ వంతెన గట్టిగా ఉందో లేదో పరీక్షించారు. 600 మీటర్ల ఎత్తున్న ఆ వంతెనపై నిలబడి కార్మికులు చేసిన ఈ పరీక్ష పెద్ద సాహసమే. ఒకవేళ ఆ గాజువంతెన పగిలిపోతే వారు అంత ఎత్తుపై నుంచి పడిపోతారు. అదే కనుక జరిగితే వారు గాల్లో ఉండగానే ప్రాణాలు కోల్పోతారు. వైరల్ అవుతోన్న ఈ వీడియోను మీరూ చూడండి....