Andhra Pradesh: కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిన ఏపీ మంత్రి వర్గం
- రూ.300 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ప్రత్యేక సదుపాయాలు
- విద్యుత్ శాఖలో 400 పైగా ఖాళీల భర్తీకి మంత్రివర్గం ఆమోదం
- రైతు సాధికార సంస్థ రూ.1000 కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు ఆమోదం
- ట్రిపుల్-పి విధానంలో భావనపాడు పోర్టు నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సమక్షంలో ఈ రోజు ఏపీ మంత్రివర్గం సమావేశం అయింది. సుదీర్ఘంగా జరుగుతోన్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
- రైతు సాధికార సంస్థ రూ.1000 కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది
- ట్రిపుల్-పి విధానంలో భావనపాడు పోర్టు నిర్మాణం
- ట్రిపుల్-పి విధానంలో భోగాపురం గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణం
- ఒంగోలు ట్రిపుల్ ఐటీకి అబ్దుల్ కలాం పేరు
- విశాఖలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ ఏర్పాటుకు ఓకే
- క్లౌడ్ హబ్ పాలసీకి ఎస్జీఎస్టీలో 50 శాతం రాయితీ ఇచ్చేందుకు నిర్ణయం
- రూ.300 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ప్రత్యేక సదుపాయాలు
- విద్యుత్ శాఖలో 400 పైగా ఖాళీల భర్తీకి మంత్రివర్గం ఆమోదం