esl narasimhan: కేసీఆర్ పేరును మార్చేసిన గవర్నర్ నరసింహన్!
- కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన గవర్నర్
- పనులు సమర్థవంతంగా జరుగుతున్నాయి
- జూన్ నాటికి కాళేశ్వరం మొదటిదశ పనులు పూర్తి
- కేసీఆర్‌ను తాను ఇకపై కాళేశ్వరం చంద్రశేఖర్‌రావు అని మాత్రమే పిలుస్తా
తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను గవర్నర్ నరసింహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాను ఈ ప్రాజెక్టు సంబంధిత అధికారులు, ఇంజనీర్లు, టెక్నీషియన్లు, వెల్డర్లతో మాట్లాడానని అన్నారు. అక్కడ అన్ని పనులు సమర్థవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ ఏడాది జూన్ నాటికి కాళేశ్వరం మొదటిదశ పనులు పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు.
కాగా, అన్ని పనులను సమర్థవంతంగా నిర్వహిస్తోన్న తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులపై గవర్నర్ ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్‌ను తాను ఇకపై కాళేశ్వరం చంద్రశేఖర్‌రావు అని మాత్రమే పిలుస్తానని, అలాగే హరీశ్‌రావు తన పేరును కాళేశ్వరరావుగా మార్చుకుని చరిత్రలో నిలిచిపోతారని గవర్నర్ వ్యాఖ్యానించారు.