aap: ఇరవై మంది ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు.. ఉత్తర్వులు జారీ
- పార్లమెంటరీ సెక్రటరీలుగా లాభదాయక పదవుల్లో కొనసాగిన 20 మంది ఎమ్మెల్యేలు
- కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదనకు రాష్ట్రపతి ఆమోదం
- ఆయా అసెంబ్లీ స్థానాల్లో త్వరలో ఉపఎన్నిక
పార్లమెంటరీ కార్యదర్శులుగా కొనసాగిన ఇరవై మంది ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం చేసిన ప్రతిపాదనను రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఆమోదించారు. 20 మంది ఆప్ ఎమ్మెల్యేల అనర్హతపై ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఈ 20 అసెంబ్లీ స్థానాలకు త్వరలో ఉపఎన్నిక నిర్వహించనున్నారు. కాగా, ఈ ఇరవై మంది ఎమ్మెల్యేలు పార్లమెంటరీ సెక్రటరీలుగా లాభదాయక పదవుల్లో కొనసాగుతున్నారని, వీరిని అనర్హులుగా ప్రకటించాలంటూ రాష్ట్రపతికి కేంద్ర ఎన్నికల సంఘం మూడు రోజుల క్రితం సిఫారసు చేసింది.