Anushka Shetty: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
- అమెరికాలో భారీ ఎత్తున అనుష్క సినిమా రిలీజ్
- బన్నీ సినిమా రిలీజ్ వాయిదా?
- సావిత్రి తల్లిగా నిన్నటి కథానాయిక
- ఆర్టిస్టుగా రకుల్ సోదరుడి అరంగేట్రం
* స్వీటీ అనుష్క నటించిన 'భాగమతి' చిత్రాన్ని అమెరికాలో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. సుమారు 125 లొకేషన్లలో అక్కడ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. 'పిల్ల జమీందార్' ఫేం అశోక్ దర్శకత్వంలో ఇది రూపొందింది.
* అల్లు అర్జున్ నటిస్తున్న 'నా పేరు సూర్య' చిత్రం రిలీజ్ డేట్ మారనున్నట్టు తెలుస్తోంది. మొదట్లో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే అదే రోజున 'భరత్ అనే నేను', '2.o' చిత్రాలు కూడా రిలీజవుతున్నందున బన్నీ చిత్రాన్ని వాయిదా వేయడానికి నిర్ణయించినట్టు సమాచారం.
* నిన్నటితరం కథానాయిక దివ్యవాణి మళ్లీ ఇప్పుడు నటిగా బిజీ అవుతోంది. కొన్ని సీరియల్స్ లో నటిస్తూనే సినిమాలలో కూడా నటిస్తోంది. ఈ క్రమంలో సావిత్రి బయోపిక్ 'మహానటి' చిత్రంలో సావిత్రి తల్లి పాత్రలో నటిస్తోంది. మంచి పాత్రలు వస్తే మరిన్ని చిత్రాలలో నటిస్తానని దివ్యవాణి చెప్పింది.
* కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ కూడా నటుడిగా మారాడు. 'సెడిషన్' పేరుతో రూపొందుతున్న హిందీ, ఇంగ్లిష్ ద్విభాషా చిత్రంలో ఆర్టిస్టుగా పరిచయం అవుతున్నాడు. త్వరలో తెలుగు సినిమాలలో కూడా నటించాలని కోరుకుంటున్నాడు.