Republic Day: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ట్విట్టర్లో ఇండియా గేట్ ఎమోజీ
- రిపబ్లిక్ డే హ్యాష్ ట్యాగ్ వాడితే ఎమోజీ ప్రత్యక్షం
- జనవరి 29 వరకు అందుబాటులో
- ట్రెండింగ్‌గా మారనున్న ఎమోజీ
69వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సామాజిక మాధ్యమం ట్విట్టర్ తనదైన రీతిలో వేడుకలను ప్రారంభించింది. అందుకోసం ప్రత్యేకంగా ఓ ఎమోజీని రూపొందించింది. #RepublicDay, #HappyRepublicDay, #RepublicDay2018 హ్యాష్‌ట్యాగ్‌లు వాడితే ఇండియా గేట్ ఎమోజీ ప్రత్యక్షమయ్యేలా ట్విట్టర్ ప్రోగ్రామ్ చేసింది. జనవరి 29 వరకు ఈ ఎమోజీ అందుబాటులో ఉండనుంది.
'గణతంత్ర దినోత్సవాన్ని ఇండియా గేట్ ఎమోజీతో ట్విట్టర్ సెలబ్రేట్ చేస్తుండటం చాలా గర్వంగా ఉంది. దేశ ప్రజల ఏకత్వాన్ని ఈ ఎమోజీ ప్రతిబింబిస్తోంది' అని ట్విట్టర్ ఇండియా పబ్లిక్ పాలసీ హెడ్ మహిమా కౌల్ అన్నారు. రిపబ్లిక్ డే పరేడ్కి ముందు ప్రధాని మోదీ ఇండియా గేట్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. అందుకే ఈ వేడుకను పురస్కరించుకోవడానికి ఎమోజీగా ఇండియా గేట్‌ను ఎంచుకున్నట్లు ట్విట్టర్ ఇండియా తెలిపింది.
ఇక ఇప్పటికే ఈ ఎమోజీ ఉపయోగించి రక్షణ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. అంతేకాకుండా ఇతర నెటిజన్లు కూడా ఈ ఎమోజీతో ట్వీట్లు చేస్తున్నారు. ఈ నాలుగు రోజులు ఇండియా గేట్ ఎమోజీ ట్రెండింగ్‌గా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.