india: భారత్లో కొత్త తరహా దాడులకు ఉగ్రవాదుల ప్లాన్.. హెచ్చరించిన నిఘా సంస్థలు
- గణతంత్ర దినోత్సవాలు ముగిసే వరకు ఏ మాత్రం అలసత్వం వద్దు
- ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాలకు కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికలు
- ప్రముఖులు పర్యటించే ప్రాంతాల్లో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి
- ప్రముఖులకు భద్రత పెంచాలి
గణతంత్ర దినోత్సవాలు ముగిసే వరకు ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించవద్దని, ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాల్లో ఉగ్రదాడులకు పాల్పడే అవకాశం ఉందని, ప్రముఖులు పర్యటించే ప్రాంతాల్లో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని నిఘా సంస్థలు హెచ్చరించాయి.
ప్రముఖులకు భద్రత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించాయి. ఉగ్రవాదులు కొత్త తరహా దాడులకు పాల్పడే అవకాశం ఉందని, మెటల్ డిటెక్టర్లకు అందకుండా ఉండేలా ఐఈడీలు రూపొందించినట్లు సమాచారం అందిందని తెలిపాయి. పెద్ద మైకులు, యాంప్లిఫైర్లు వంటి పరికరాల్లో ఐఈడీలను అమర్చడం ద్వారా దాడులకు దిగే అవకాశం ఉందని చెప్పాయి.