raghavendra rao: ఆ వార్తల్లో నిజం లేదు: 'దర్శకేంద్రుడు' కె.రాఘవేంద్రరావు వివరణ
- టీటీడీ ఛైర్మన్ బాధ్యతలు అంటూ వార్తలు
- ఖండించిన దర్శకేంద్రుడు
- స్వామివారి సేవలో తరించాలన్నదే తన కోరిక అని స్పష్టం
గత రెండు, మూడు రోజులుగా కొన్ని పత్రికలలోను, సోషల్ మీడియాలోను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు వార్తలు రావడంతో వేలాదిమంది ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. అయితే ఈ వార్తల్లో నిజం లేదని కె. రాఘవేంద్రరావు ఖండించారు. ఎస్.వి.ఎస్.సి. ఛానల్ ద్వారా స్వామివారి సేవ చేస్తున్న తాను ఈ ఛానెల్లో స్వామివారిపై మరిన్ని కొత్త కార్యక్రమాలని వైవిధ్యంగా రూపొందించి భక్త జనకోటిని అలరిస్తూ, స్వామివారి సేవలో తరించాలన్నది ఒక్కటే తన కోరిక అని రాఘవేంద్రరావు స్పష్టం చేశారు.