suresh prabhu: ముస్లింలకు వ్యతిరేకమే అయితే ట్రిపుల్ తలాక్ బిల్లును ఎందుకు తీసుకొస్తాం?: సురేశ్ ప్రభు
- మతం ఆధారంగా వివక్ష ఉండదు
- అభివృద్ధి ఫలాలు అందరికీ చేరాలి
- అందరూ సమానంగా హక్కులను అనుభవించాలి
మతం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు అన్నారు. దావోస్ పర్యటనలో ఉన్న ఆయన ‘ప్రపంచంలో భారత పాత్ర’ అనే అంశంపై మాట్లాడారు. పౌరులు అందరూ సమాన హక్కులను అనుభవించాలని ఆశించారు. అభివృద్ధి తాలూకూ ఫలాలు ప్రతీ ఒక్కరినీ చేరాలని పేర్కొన్నారు.
‘‘మేం ముస్లింలకు వ్యతిరేకమే అయితే ట్రిపుల్ తలాక్ బిల్లును తీసుకొచ్చేవాళ్లమే కాదు. ముస్లింల జనాభా 14 శాతం అయితే ఇందులో సగం మంది మహిళలే. ఈ వర్గానికి వ్యతిరేకం అయితే మహిళల హక్కులను కాపాడేందుకు బిల్లులను ఎందుకు తీసుకొస్తాం?’’ అని సురేశ్ ప్రభు అన్నారు.