prabhas: ప్రభాస్ దగ్గర నేర్చుకోవలసింది సహనమే: ప్రభాస్ శ్రీను
- ప్రభాస్ కి చాలా సహనం ఎక్కువ
- ఆయన చాలా కూల్ గా వుంటారు
- అందరినీ సమానంగా చూస్తారు
ప్రభాస్ కి చాలాకాలంగా దగ్గరగా ఉంటూ వస్తోన్న ప్రభాస్ శ్రీను, తాను ప్రభాస్ కి అంత దగ్గర కావడానికి గల కారణాన్ని గురించి ప్రస్తావించారు. "ప్రభాస్ కి కష్టపడేవాళ్లంటే చాలా ఇష్టం .. నాలోని కష్టపడే తత్వమే ఆయనకి నన్ను దగ్గర చేసింది. ఆయన అంత పెద్ద స్టార్ అయ్యుండి .. అందరినీ డాళింగ్ అని పిలుస్తుంటారు. తనతో కలిసి పనిచేస్తున్న వాళ్లందరినీ సమానంగా చూస్తుంటారు.
ప్రభాస్ కంటే వయసులో నేను పెద్దవాడినే అయినా, ఆయనే నాకు స్ఫూర్తి. ఆయన సహనం .. ఓపిక ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అవి ఆయనకి భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్, అంతే. ఎలాంటి చికాకు .. టెన్షన్స్ లేకుండా చాలా కూల్ గా వుంటారాయన. ఓ పది రోజుల పాటు ఓ ఫైట్ షూటింగ్ కి వెళ్లడం నాకు చాలా చికాకు కలిగించింది. అలాంటిది 'బాహుబలి' షూటింగ్ కోసం ఆయన అన్ని సంవత్సరాలు కేటాయించడమే ఆయన సహనానికి నిదర్శనం" అని అన్నాడు.