Kamal Haasan: దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి!: ప్రజలకు కమలహాసన్ పిలుపు
- దేశాన్ని ఎవరు దోచుకుంటున్నారో కూడా తెలుసుకోవాలి
- ప్రజలంతా కలిస్తే సమాజంలో మార్పులు తీసుకురావచ్చు
- ఆ సమయం ఆసన్నమైంది
- ప్రభుత్వం మద్యంపై వచ్చే ఆదాయంపై దృష్టి పెట్టొద్దు
దేశంలో ఏం జరుగుతుందో ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని సినీనటుడు కమలహాసన్ అన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఇటీవలే కమల హాసన్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కమల హాసన్ మాట్లాడుతూ యువత తనతో కలిసి పనిచేయడానికి రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.
అలాగే, దేశాన్ని ఎవరు దోచుకుంటున్నారో కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు. ప్రజలంతా కలిస్తే సమాజంలో మార్పులు తీసుకురావచ్చని, ఆ సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. కాగా, ప్రభుత్వం లిక్కర్ వ్యాపారులతో వచ్చే ఆదాయంపై దృష్టి పెట్టకుండా దేశంలో విద్య, పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.