gandhi vardhanthi: అమరవీరుల సంస్మరణ: రెండు నిమిషాల పాటు ఆగిపోయిన హైదరాబాద్!
- గాంధీ వర్ధంతి సందర్భంగా మౌనం
- స్వాతంత్ర్యం కోసం త్యాగాలకు పాల్పడ్డవారిని స్మరించుకున్న జనం
- ఎక్కడికక్కడే ఆగిపోయిన వాహనాలు
గాంధీ వర్ధంతి సందర్భంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలన్న ప్రభుత్వ ఆదేశాలను, సూచనలను ప్రజలు స్వచ్ఛందంగా పాటించారు. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి 2 నిమిషాల పాటు ఎక్కడివారు అక్కడే మౌనం పాటించారు. దీంతో, జంటనగరాలు రెండు నిమిషాల సేపు నిలిచిపోయాయి. రహదార్లపై వాహనాలను పోలీసులు ఎక్కడికక్కడే ఆపివేశారు. ఆ సమయంలో వాహనదారులు హారన్లను కూడా మోగించలేదు.
పాదచారులు, విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు ఇలా అందరూ మౌనాన్ని పాటించారు. స్వాతంత్ర్యం కోసం బలిదానం చేసిన వారి త్యాగాలను స్మరించుకుంటూ మౌనం పాటించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం కూడా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు అయ్యారు.