love: తాట తీస్తే కానీ... తాళి కట్టలేదు!
- ప్రేమించి, సహజీవనం చేస్తున్న ప్రియుడు
- వేరొకరితో పెళ్లికి రెడీ అయిన వైనం
- పెద్దల సమక్షంలో దేహశుద్ధి చేసి, తాళి కట్టించుకున్న ప్రియురాలు
తనను ప్రేమించి, రహస్యంగా సహజీవనం చేస్తున్న ప్రియుడు... వేరొకరితో పెళ్లికి సిద్ధపడటంతో ఆమె శివంగిలా మారింది. ప్రియుడుని అందరిముందు చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పడమే కాకుండా... అతని చేతే తాళి కట్టించుకుంది. ఈ ఘటన కర్నూలు జిల్లా పాణ్యంలోని రాంభూపాల్ రెడ్డి కాలనీలో చోటు చేసుకుంది.
కాలనీకి చెందిన దివ్యాబాయి, నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన చంద్రశేఖర్ లు ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అడ్డు చెప్పడంతో, రహస్యంగా సహజీవనం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో, తన అత్త కూతురును పెళ్లి చేసుకునేందుకు చంద్రశేఖర్ సిద్ధమయ్యాడు. దీంతో, నంద్యాలలో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి... చంద్రశేఖర్ కు చెప్పుతో దేహశుద్ధి చేసింది. తనకు న్యాయం చేయాలని పెద్దలను వేడుకుంది. దీంతో, టెక్కెలోని సుంకులమ్మ ఆలయంలో వీరిద్దరి వివాహాన్ని పెద్దలు జరిపించారు.