budget: ఏడాదికి రూ.5 లక్షల వైద్య బీమా... దేశంలో 50 కోట్ల మందికి కేంద్రం బహుమానం

  • ఒక్కో కుటుంబానికి అందించే కవరేజీ
  • మొత్తం 10 కోట్ల కుటుంబాలకు కేంద్ర సాయం
  • బడ్జెట్ లో ప్రకటించిన అరుణ్ జైట్లీ

ఏటేటా వైద్య ఖర్చులు సామాన్యులు భరించలేని స్థాయికి చేరుతుండడంతో కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో దీనిపై దృష్టి సారించింది. దేశంలో 50 కోట్ల మంది ప్రజలకు ఇకపై కేంద్రమే వైద్య సాయం అందించనుంది. ఇందుకోసం జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఆరోగ్య రక్షణను నూతన ఆకాంక్షల స్థాయికి తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు.

అంటే ఒక్కో కుటుంబంలో సగటున ఐదుగురు సభ్యులను పరిగణనలోకి తీసుకుంటే 50 కోట్ల మందికి ప్రభుత్వపరంగా ఆరోగ్య రక్షణ లభించనుంది. ఏటా రూ.5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీని ఓ కుటుంబానికి అందించనున్నట్టు అరుణ్ జైట్లీ చెప్పారు. ఆస్పత్రిలో చేరిన వారికి ఈ స్థాయిలో ప్రయోజనం అందించడమన్నది ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు.

  • Loading...

More Telugu News