Arun Jaitly: జైట్లీ బడ్జెట్ ప్రభావం .. దిగుమతి వస్తువుల ధరలు పెరిగేవి - తగ్గేవి!
- 2018-19 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలు
- వెండి, బంగారం, కూరగాయలు, ఫ్రూట్ జ్యూసెస్, సన్ గ్లాసెస్ మొదలైన వాటి ధరలు పెరుగుతాయి
- ముడి జీడిపప్పు, టెంపర్డ్ గ్లాస్ తదితర వస్తువుల ధరలు తగ్గనున్నాయి
2018-19 వార్షిక బడ్జెట్ ను ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రభావం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పలు వస్తువులపై పడనుంది. దిగుమతి చేసుకునే మొబైల్ హేండ్ సెట్స్, కార్లు, మోటార్ సైకిల్స్, ఫ్రూట్ జ్యూసెస్, ఫెర్ఫ్యూమ్స్, పాదరక్షలు మొదలైన వాటిపై కస్టమ్స్ డ్యూటీ పెరగనుంది.
ధరలు పెరగనున్న దిగుమతి వస్తువుల జాబితా...
* వెండి
* బంగారం
* కూరగాయలు, ఫ్రూట్ జ్యూసెస్ (ఆరెంజ్, క్రాన్ బెర్రీ)
* సన్ గ్లాసెస్
* సోయా ప్రొటీన్ లేని ఇతర ఆహారపదార్థాలు
* పెర్ఫ్ప్యూమ్స్
* సన్ స్క్రీన్, సన్ ట్యాన్, మేనిక్యూర్, పెడిక్యూర్ సంబంధిత ఉత్పత్తులు
* దంత సంరక్షణకు సంబంధించిన పేస్ట్ లు, పౌడర్లు, డెంటల్-ఫ్లాస్
* ప్రీ-షేవ్, షేవింగ్, ఆఫ్టర్-షేవ్ ఉత్పత్తులు
* డియోడరెంట్స్, స్నాన, కేశ సంబంధిత అత్తరు ఉత్పత్తులు
* ట్రక్, బస్సులకు సంబంధించిన రేడియల్ టైర్స్
* సిల్క్ దుస్తులు
* పాదరక్షలు
* రంగురాళ్లు
* వజ్రాలు
* గిల్ట్ నగలు (ఇమిటేషన్ జువెల్లరీ)
* స్మార్ట్ వాచీలు
* ఎల్సీడీ/ఎల్ఈడీ టీవీ ప్యానెల్స్
* ఫర్నీచర్
* తివాచీలు
* ల్యాంప్స్
* చేతి గడియారాలు, జేబు గడియారాలు, గడియారాలు
* త్రిచక్ర వాహనాలు, స్కూటర్లు, పెడల్ కార్లు, బొమ్మలు (చక్రాలు ఉన్నవి), డాల్స్, డాల్స్ క్యారేజెస్, బొమ్మలు, అన్ని రకాల పజిల్స్
* వీడియో గేమ్ కంట్రోల్స్, స్విచెస్
* స్పోర్ట్స్/అవుట్ డోర్ గేమ్స్, స్మిమ్మింగ్ పూల్స్, ప్యాడ్లింగ్ పూల్స్ (చిన్ప పిల్లలకు స్నానం చేయించే నీళ్ల తొట్టెలు)కు సంబంధించిన వస్తువులు, పరికరాలు
* సిగిరెట్స్, లైటర్లు, క్యాండిల్స్
* గాలి పటాలు
* ఎడిబుల్ / వెజిటబుల్ ఆయిల్స్ .. ఆలివ్ నూనె, వేరుశెనగ నూనె
ధరలు తగ్గనున్న దిగుమతి వస్తువుల జాబితా...
* ముడి జీడిపప్పు
* సోలార్ ప్యానెల్స్ లేదా మాడ్యూల్స్ కు వినియోగించే టెంపర్డ్ గ్లాస్
* శ్రవణ యంత్ర పరికరాల తయారీలో వినియోగించే ముడి వస్తువులు, ఇతర వస్తువులు
* ఎంపిక చేసిన క్యాపిటల్ గూడ్స్ ( ఇతర వస్తువులను తయారు చేసేందుకు వినియోగించే ఫ్యాక్టరీ మిషన్లు), బాల్ స్క్రూస్ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి.