Earthquake: బ్రేకింగ్ న్యూస్... మహారాష్ట్రలోని సత్తారా సమీపంలో భూకంపం
- ఉపరితలానికి 10 కి.మీ. లోతున కేంద్రం
- 3.4 తీవ్రతతో ప్రకంపనలు
- వీధుల్లోకి పరుగులు పెట్టిన ప్రజలు
మహారాష్ట్రలోని సత్తారా పట్టణ సమీపంలో ఈ ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రతతో కూడిన ప్రకంపనలు నమోదైనట్టు భారత భూభౌతిక శాస్త్ర విభాగం వెల్లడించింది. ఉపరితలానికి సుమారు 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు. 3.4 తీవ్రతతో వచ్చే భూకంపాలు ఎటువంటి హానీ కలిగించబోవని అన్నారు.
తొలి ప్రకంపన ఉదయం 7.11 గంటల సమయంలో నమోదైందని, ఆపై మరికొన్ని స్వల్ప ప్రకంపనలు వచ్చాయని అన్నారు. కాగా, భూకంపం వస్తోందని ప్రజలు ఇళ్లలోంచి వీధుల్లోకి పరుగులు పెట్టారు. ఈ భూకంప నష్టంపై వివరాలు అందాల్సి వుంది. కాగా, జనవరి 31న ఆఫ్గనిస్థాన్ కేంద్రంగా 6.2 తీవ్రతతో భూకంపం రాగా, దాని ప్రభావం ఉత్తరాది వరకూ కనిపించిన సంగతి తెలిసిందే.