North Korea: ఆంక్షల ప్రభావం నిల్.. ఎగుమతుల ద్వారా 200 మిలియన్ డాలర్ల ఆదాయం సంపాదించిన ఉ.కొరియా!
- ఇతర దేశాలతో వాణిజ్య, వ్యాపారాలు చేయకుండా ఐక్యరాజ్య సమితి ఇప్పటికే ఆంక్షలు
- అయినప్పటికీ ఉత్తరకొరియా నుంచి ఎగుమతులు
- సముద్ర మార్గం ద్వారా చైనా, మలేసియా, దక్షిణకొరియా, రష్యా వంటి దేశాలకు ఎగుమతి
దుందుడుకు చర్యలకు పాల్పడుతోన్న ఉత్తరకొరియా ఇతర దేశాలతో వాణిజ్య, వ్యాపారాలు చేయకుండా ఐక్యరాజ్య సమితి ఇప్పటికే ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఉత్తరకొరియా నుంచి ఎగుమతులు ఏ మాత్రం ఆగడం లేదు. గతేడాది జనవరి-సెప్టెంబరు మధ్య ఆ దేశం బొగ్గు, ఇనుము, స్టీల్ ఎగుమతులు చేసి 200 మిలియన్ డాలర్ల ఆదాయం పొందింది. ఉత్పత్తులను సముద్ర మార్గం ద్వారా చైనా, మలేసియా, దక్షిణకొరియా, రష్యా వంటి దేశాలకు ఎగుమతి చేసినట్లు ఐక్య రాజ్యసమితి తెలిపింది.
మరోవైపు సిరియాతో కలిసి ఉత్తరకొరియా బాలిస్టిక్ క్షిపణులు కూడా తయారు చేస్తోందని స్పష్టం చేసింది. వరసగా క్షిపణి ప్రయోగాలు చేస్తోన్న ఉత్తరకొరియాను అదుపు చేయడానికి ఆ దేశంపై పలు ఆంక్షలు విధించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అప్పట్లో అమెరికా తీర్మానం ప్రవేశపెట్టగా, దానికి ఆమోదం కూడా లభించింది.