hotel: ఖైదీల వంటలు భళా... కేరళలో తెగ డిమాండ్

  • ఖైదీలతో హోటళ్లు, బేకరీలు
  • ఆదరిస్తున్న ప్రజలు
  • ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం

ఖైదీలంటే జైలులో శిక్షలు అనుభవించడం ఒక్కటే అనుకునేరు. ఇది గతం. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో ఖైదీలతో వివిధ రకాల పనికొచ్చే పనులు చేయిస్తున్నారు. కేరళలో ఖైదీలను పాకశాస్త్ర ప్రవీణులుగా వినియోగించుకుంటూ చక్కని ఆదాయంతోపాటు కస్టమర్ల సంతృప్తిని చూరగొంటోంది అక్కడి జైళ్ల శాఖ.

2012లో ఖైదీలతో తొలి హోటల్ ప్రారంభించారు. మొదట్లో చికెన్, చపాతీ అందించగా, మంచి స్పందన వచ్చింది. కన్నూర్, త్రిస్సూర్, తిరువనంతపురం ఇలా పలు చోట్ల ఖైదీలతో వంట శాలలు మొదలయ్యాయి. దీన్ని మరింత ప్రోత్సహించేందుకు అక్కడి ప్రభుత్వం పన్ను రాయితీలు కూడా ఇచ్చింది. దీంతో తక్కువ ధరకే రుచికరమైన, నాణ్యమైన ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచారు. ఫలితంగా సాధారణ ప్రజలు ఖైదీల వంటల రుచి చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. త్రిస్సూర్, కన్నూర్ లో మహిళా ఖైదీలతో బేకరీలు కూడా నడుపుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో వీటిని ప్రారంభించే ఆలోచనతో అక్కడి జైళ్ల శాఖ ఉంది.

  • Loading...

More Telugu News