army: మాటలతో కాదు, చేతలతోనే పాక్ కు సమాధానం ఇస్తాం: భారత ఆర్మీ
- జవాన్ల హత్యలకు ప్రతీకారం తప్పదు
- పాక్ మూల్యం చెల్లించుకోవాల్సిందే
- నిన్నటి ఘటనతో రగిలిపోతున్న ఆర్మీ దళాలు
మాటలతో కాదు, చేతలతోనే పాక్ కు సమాధానం చెబుతామంటోంది భారత ఆర్మీ. నిన్న సరిహద్దుల్లో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడి భారత జవాన్లను బలితీసుకున్న విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఆర్మీ స్పష్టం చేసింది.
‘‘ప్రతీకారం అన్నది మాటల రూపంలో కాకుండా జరిగిపోతుంది. దాని గురించి నేను చెప్పను. చేతలతోనే దానికి బదులిస్తాం’’ అని ఆర్మీ వైస్ చీఫ్ శరత్ చంద్ అన్నారు. జమ్మూ కశ్మీర్ లోని రాజౌరీ సెక్టార్ లో నిన్న పాకిస్థాన్ దళాల కాల్పులకు నలుగురు భారత జవాన్లు నేలకొరగడంతో దీనిపై ఆర్మీ జవాన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పాకిస్థాన్ చర్యలను క్షమించేది లేదని, దీనికి ఆ దేశం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి హన్స్ రాజ్ అహిర్ పేర్కొన్నారు.