bhanuchandar: తెలుగులో హీరో పాత్ర ఏదైనా డాన్సులు .. కామెడీ చేయాల్సిందే: భానుచందర్
- మలయాళ సినిమాలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి
- తరువాత స్థానంలో తమిళ మూవీస్ ఉంటాయి
- కన్నడ సినిమాల తీరు వేరు
- తెలుగు సినిమాలే చివరన కనిపిస్తాయి
నిన్నటితరం కథానాయకులలో ఒకరిగా .. మాస్ యాక్షన్ హీరోగా మార్కులు కొట్టేసినవారి జాబితాలో ఒకరిగా భానుచందర్ కనిపిస్తారు. తాజాగా ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటార్వ్యూలో మాట్లాడుతూ, వివిధ భాషల్లో నటుడిగా తన ప్రయాణాన్ని గురించి ప్రస్తావించారు. తమిళ .. మలయాళ .. కన్నడ భాషా చిత్రాలకీ, తెలుగు సినిమాలకి మధ్య గల తేడాను గురించి ఆయన మాట్లాడారు.
"దక్షిణాదిన మలయాళం సినిమాలు చెప్పుకోదగినవిగా ఉంటాయి .. ఆ తరువాత స్థానంలో తమిళ సినిమాలు కనిపిస్తాయి. కన్నడ సినిమాలకి వచ్చేసరికి వాళ్ల బడ్జెట్ .. సినారియో వేరు. నా దృష్టిలో తెలుగు సినిమా.. చివరలో ఉంటుంది. తెలుగులో బిచ్చగాడైనా .. కోటీశ్వరుడైనా .. ఐఏఎస్ ఆఫీసర్ అయినా .. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయినా సరే డాన్సులు చేయాలి .. కామెడీ చేయాలి .. ఏడవాలి. ఇవన్నీ ఒకే సినిమాలో ఉండాలి .. అన్ని సినిమాల్లోను ఇవన్నీ కావాలి. అందువల్లనే తెలుగు సినిమాలు ఇంకా మారలేదనిపిస్తోంది" అంటూ భానుచందర్ తన మనసులోని మాటను చెప్పుకొచ్చారు.