Petrol: వాహనదారులకు నిరాశ.. పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గే అవకాశం లేనట్టే!
- పెట్రో ధరలపై రూ.2 సుంకం తగ్గింపు ఆలోచన నుంచి వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- ద్రవ్యలోటు ఎక్కువగా ఉండే అవకాశాలుండడంతోనే నిర్ణయం
- పెట్రో ధరల్లో 50 శాతం పన్నులే
పెట్రోలు, డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఇటీవలి బడ్జెట్లో పెట్రోలు, డీజిల్పై రూ.2 చొప్పున దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు అందుకు సహకరించేలా లేకపోవడంతో ఈ విషయాన్ని పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. అంచనా వేస్తున్న దానికంటే ద్రవ్యలోటు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండడంతో ఇప్పుడు దిగుమతి సుంకాన్ని తగ్గిస్తే ప్రభుత్వంపై మరింత భారం పడే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. అందుకనే ఈ ఆలోచన నుంచి ప్రభుత్వం ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి.
ఇక, దక్షిణాసియాలోని ఇతర దేశాలతో పోలిస్తే పెట్రో ధరలు భారత్లోనే అధికం. పెట్రోలు రిటైల్ ధరల్లో 50 శాతం పన్నులే ఉండడంతో ఇరుగు పొరుగు దేశాల కంటే కూడా భారత్లో పెట్రో ధరలు అధికంగా ఉంటున్నాయి.