YSRCP: రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయిన వైసీపీ ఎంపీలు!

  • పార్లమెంట్ సమావేశాలకు ముందు భేటీ
  • విభజన హామీలపై చర్చించామన్న ఎంపీలు
  • రాజ్ నాథ్ సానుకూలంగా స్పందించారన్న నేతలు

విభజన హామీలకు సంబంధించి పార్లమెంటు సమావేశాల్లో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ ఎంపీలు ఎవరికి వారు నిరసన కార్యక్రమాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఈ ఉదయం వైసీపీ ఎంపీలు కలిశారు. విభజన హామీలను అమలు చేయాలని ఈ సందర్భంగా రాజ్ నాథ్ ను కోరారు.

అనంతరం మీడియా ప్రతినిధులతో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వైయస్ అవినాష్ రెడ్డి, వరప్రసాద్ లు మాట్లాడుతూ... ప్రత్యేక హోదా, కడప స్టీల్ ప్లాంట్, పోలవరం, విశాఖ రైల్వే జోన్, దుగరాజపట్నం తదితర అంశాలను రాజ్ నాథ్ దృష్టికి తీసుకొచ్చామని చెప్పారు. విభజన హామీల పట్ల కేంద్ర హోంమంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. హామీల అమలుపై టీడీపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి చేయడం లేదని ఆరోపించారు.

  • Loading...

More Telugu News