britishers: బ్రిటీష్ వాళ్లు తెల్లజాతీయులు కాదు.. నల్లజాతీయులు.. సంచలనం రేకెత్తిస్తున్న డీఎన్ఏ రిపోర్ట్!

  • సోమర్సెట్ లో లభించిన 10 వేల ఏళ్ల నాటి మానవ కళేబరంపై డీఎన్ఏ రిపోర్ట్
  • తొలి ఆంగ్లేయుడు నల్లజాతీయుడని తేలిన నిజం
  • నల్లటి వర్ణం, ఉంగరాల జుట్టు, నీలి కళ్లతో బ్రిటీష్ తొలి తరం

తెల్లజాతీయులమనే అహంకారంతో విర్రవీగే బ్రిటిషర్లకు తాజా డీఎన్ఏ రిపోర్ట్ షాకిచ్చింది. బ్రిటిషర్లు శ్వేతజాతీయులే కాదు... ఆంగ్లేయుల తొలి తరంవారు నల్లజాతీయులు అంటూ తేల్చి చెప్పింది. వివరాల్లోకి వెళ్తే, బ్రిటన్ లోని సోమర్సెట్ చెద్దార్ లోయలో లభించిన అతి పురాతన మానవ కళేబరంపై శాస్త్రవేత్తలు డీఎన్ఏ పరీక్షలను నిర్వహించారు. పదివేల సంవత్సరాల క్రితం ఈ వ్యక్తి మరణించాడు. ఈ వ్యక్తి ఎముకలపై తొలిసారిగా అత్యంత ఆధునికమైన జన్యు పరీక్షలు నిర్వహించారు. ఫేషియల్ రీకన్ స్ట్రక్షన్ టెక్నిక్స్ ద్వారా అసాధారణ విషయాలను వెలికితీశారు.

తొలితరం ఆంగ్లేయులు నలుపు రంగులో, ఉంగరాల జుట్టు, నీలి కళ్లు కలిగి ఉన్నారని పరీక్షల్లో వెలుగు చూసింది. ఈ వ్యక్తి 'బ్లాక్' అంటూ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఆంగ్లేయులు శ్వేత జాతీయులు కాదని... కలక్రమేణా వారి చర్మం రంగు మారి ఉండవచ్చని తమ పరిశోధనలో తేలిందని చెప్పారు. ఈ మానవ కళేబరం చెద్దార్ లోయలో 1903లో లభించింది. ఈ కళేబరం అప్పటి నుంచే సంచలనంగా మారింది.

గత వందేళ్లకు పైగా దీనికి సంబంధించిన విషయాలను వెలికి తీసే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు తలమునకలై ఉన్నారు. సదరు వ్యక్తి ముఖకవళికలు ఎలా ఉంటాయోనని... తమ పూర్వీకుల గురించి ఎలాంటి విషయాలు తెలుస్తాయోననే ఉత్కంఠను బ్రిటిషర్లు అనుభవించారు. చివరకు యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్, నేచురల్ హిస్టరీ మ్యూజియంలు నిర్వహించిన జన్యు పరీక్షల్లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి.
.

  • Loading...

More Telugu News