Parliament: రామాయణంలో ఆ నవ్వు ఎవరిదబ్బా?... పార్లమెంటు లాబీల్లో ఎడతెగని చర్చ!

  • నిన్న మోదీ ప్రసంగాన్ని అడ్డుకున్న రేణుకా చౌదరి
  • రామాయణంలోని ఓ పాత్ర నవ్వుతో పోల్చిన ప్రధాని
  • ఆ పాత్ర ఏంటోనని ఆసక్తికర చర్చ!

నిన్న రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్న వేళ, తనను అడ్డుకుంటున్న కాంగ్రెస్ మహిళా ఎంపీ రేణుకా చౌదరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఎడతెగని చర్చ జరుగుతోంది. మోదీ ప్రసంగిస్తుండగా, గట్టిగా నవ్విన శబ్దం రాగా, అందరూ అటువైపు చూడగా రేణుగా చౌదరి కనిపించిన సంగతి తెలిసిందే.

ఆ సమయంలో చైర్ లో ఉన్న వెంకయ్యనాయుడు, ప్రధాని ప్రసంగాన్ని ఆపించి, మీకేమైంది? ఈ ప్రవర్తన సరికాదని హితవు పలకగా, "సభాపతి గారూ, రేణుకను అడ్డుకోకండి. రామాయణం సీరియల్ తరువాత అంతటి నవ్వును వినే భాగ్యం ఈ రోజే మనకు దక్కింది" అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఇక రామాయణంలోని ఏ పాత్రతో రేణుకను ప్రధాని పోల్చారా? అని ఎంపీల మధ్య చర్చ ఆసక్తికరంగా జరుగుతోంది. వాస్తవానికి మహాభారతంలో ద్రౌపది నవ్వు కురుక్షేత్ర యుద్ధానికి దారితీసిందన్న సామెతలను మనం వింటుంటాం. మరింక రామాయణంలో ఎవరు నవ్వారో, వారి నవ్వు ఫలితమేంటో ప్రధానే చెప్పాలేమో?!

  • Loading...

More Telugu News