kanna lakshminarayana: టీడీపీపై విమర్శలు గుప్పించిన మరో ఏపీ బీజేపీ నేత

  • ఏపీకి ఇవ్వాల్సిన దానికన్నా కేంద్రం ఎక్కువే ఇచ్చింది
  • మిత్రధర్మాన్ని టీడీపీనే మరిచింది
  • ట్రిపుల్ తలాక్ విషయంలో మోకాలడ్డింది

మిత్రపక్షంలో ఉండి కూడా తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శలు గుప్పించడం సంచలనం రేపింది. ఆయన వ్యవహారశైలిపై టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు. సోము వీర్రాజుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ పార్లమెంటు సమావేశాల్లో టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీపై బీజేపీకి చెందిన మరో నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు ఎక్కుపెట్టారు. ఏపీకి ఇవ్వాల్సిన దానికన్నా కేంద్రం ఎక్కువగానే ఇచ్చిందని ఆయన అన్నారు.

ప్రతిపక్షం ఉచ్చులో పడొద్దని... మిత్ర ధర్మాన్ని పాటించి, తమకు టీడీపీ సహకరించాలని చెప్పారు. 'బీజేపీని ముంచాలనే ప్రయత్నంలో మీరు మునగొద్దు' అని సూచించారు. మిత్రధర్మాన్ని మరిచింది టీడీపీనే అని... బీసీ చట్టబద్ధత, ట్రిపుల్ తలాక్ విషయంలో కాంగ్రెస్ తో కలసి మోకాలడ్డారని విమర్శించారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని దాడి చేయడం సరికాదని చెప్పారు. 

@
  • Loading...

More Telugu News