america: సిరియాలోని డైర్ ఎజ్జోర్ ప్రావిన్స్‌లో దాడులు చేసి.. 100 మందిని హతమార్చిన అమెరికా
- సిరియా ప్రభుత్వ అనుకూల దళాలపై దాడులు
- తూర్పు సిరియాలో జరిగిన దాడులకు అమెరికా ప్రతీకారం
- సిరియా దళాల దూకుడును అడ్డకునేందుకేనంటోన్న అమెరికా
సిరియాలోని డైర్ ఎజ్జోర్ ప్రావిన్స్‌లో ప్రభుత్వ అనుకూల దళాలపై అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారని అమెరికా ప్రకటించింది. ఇటీవల తూర్పు సిరియాలో జరిగిన దాడులకు ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు సమాచారం. సిరియా దళాలు రసాయన ఆయుధాలు వాడుతున్నారని అనుమానిస్తోన్న అమెరికా.. సిరియా దళాల దూకుడును అడ్డకునేందుకు ఈ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఎస్డీఎఫ్కి చెందిన ఒకరు గాయపడ్డారని అమెరికా తెలిపింది. కాగా, ఈ దాడుల్లో 20 మంది మృతి చెందినట్లు సిరియాలోని మానవ హక్కుల పరిశీలన సంస్థ అంటోంది.