CM Ramesh: ఇన్ని రోజులు ఓపిక పట్టాం.. ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయాల్సిందే: లోక్‌సభలో సీఎం రమేశ్ మండిపాటు
- ఇక పోరాటమే
- తెలుగు ప్రజలు ఓపిక పట్టే రోజులు పోయాయి
- విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇవ్వాల్సిందే
- కారణాలు చెబుతూ కూర్చోకూడదు
ఇన్ని రోజులు తాము ఓపిక పట్టామని, ఇక ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఇక పోరాటమే కొనసాగుతుందని రాజ్యసభలో సీఎం రమేశ్ అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ రావాల్సిందేనని ఉద్ఘాటించారు. తెలుగు ప్రజలు ఓపిక పట్టే రోజులు పోయాయని, విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇవ్వాల్సిందేనని అన్నారు. తమ టీడీపీ నేతలకి, ఏపీ ప్రజలకి ఓపిక నశించిందని అన్నారు. ఏవో కారణాలు చెబుతూ కూర్చోకూడదని అన్నారు. రాజస్థాన్‌కి ఒక్క న్యాయం, ఏపీకి ఒక న్యాయం చేసేలా కేంద్ర ప్రభుత్వం తీరు ఉందని అన్నారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పారు.
ఏపీలో పరిశ్రమల కోసం భూములు, నీళ్లు ఇస్తామని కూడా ఇప్పటికే చెప్పామని, ఆ విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదని సీఎం రమేశ్ అన్నారు. విశాఖపట్నం, విజయవాడకు మెట్రో ఇస్తామన్నారని, ఇవి పట్టించుకోకుండా కర్ణాటకలో మెట్రో అంటూ ప్రకటన చేశారని విమర్శించారు. తమకు ఏమీ ఇవ్వలేదని, వారికో న్యాయం మాకో న్యాయమా? అని ప్రశ్నించారు.