GOOGLE: గూగుల్ కి 136 కోట్ల జరిమానా విధించిన భారత్!
- అనుచిత వ్యాపార విధానాలు అవలంబించిన గూగుల్
- పోటీ సంస్థలు, యూజర్లు నష్టపోయారన్న సీసీఐ
- జరిమానా చెల్లించేందుకు 60 రోజుల గడువు
సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) 136 కోట్ల రూపాయల జరిమానా విధించింది. 2012లో గూగుల్ పై అనుచిత వ్యాపార ధోరణుల కేసు దాఖలయింది. గూగుల్ కు చెందిన ఆల్ఫాబెట్ కంపెనీ వెబ్ సెర్చ్ లో, అడ్వర్టెయిజ్ మెంట్స్ లో పైచేయి సాధించేందుకు అనుచిత విధానాలు వినియోగించినట్టు తేలింది. దీనివల్ల పోటీ సంస్థలు, యూజర్లు నష్టపోయారని సీసీఐ తేల్చిచెప్పింది. దీంతో ఈ జరిమానా విధించినట్టు తెలిపింది. జరిమానా చెల్లించేందుకు రెండు నెలల గడువును ఇచ్చింది. అన్ని కోణాల నుంచి సునిశితంగా పరిశీలించిన తరువాతే జరిమానా విధించామని సీసీఐ స్పష్టం చేసింది.