India: భారత్ పౌల్ట్రీ దిగుమతులపై సౌదీ నిషేధం!
- ఒఐఇ నివేదిక ఆధారంగా భారత పౌల్ట్రీ దిగుమతులపై నిషేధం
- బెంగళూరులోని కోళ్ల ఫారంలో ప్రమాదకరమైన బర్డ్ ఫ్లూ
- భారత్ నుంచి పౌల్ట్రీ దిగుమతులన్నింటిపైనా నిషేధం
భారత్ పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతిపై సౌదీఅరేబియా నిషేధం విధించింది. పారిస్ కేంద్రంగా పనిచేసే ప్రపంచ పశు ఆరోగ్య సంస్థ (ఒఐఇ) నివేదిక ఆధారంగా భారతీయ పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతులపై నిషేధం విధించినట్టు సౌదీఅరేబియా వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బెంగుళూరులోని ఒక కోళ్ల ఫారంలోని కోళ్లకు ప్రమాదకరమైన బర్డ్ ఫ్లూ వ్యాధి సోకినట్టు తేలిందని, దీంతో నిషేధం చర్య తీసుకున్నామని ఆ శాఖ ప్రకటించింది. భారత్ నుంచి బతికున్న కోళ్లతో పాటు కోడి పిల్లల ఉత్పత్తికి ఉపయోగించే హేచింగ్ ఎగ్స్, కోడి పిల్లల దిగుమతిని కూడా నిషేధించినట్టు తెలిపింది.