KTR: రాష్ట్రపతితో భేటీ అయిన కేటీఆర్
- వరల్డ్ ఐటీ కాంగ్రెస్ కు ఆహ్వానించిన కేటీఆర్
- ఈ నెల 19 నుంచి 21 వరకు సదస్సు
- సదస్సుకు హాజరుకానున్న శ్రీలంక ప్రధాని
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను తెలంగాణ మంత్రి కేటీఆర్ కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో జరగనున్న వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సదస్సు ముగింపు కార్యక్రమానికి రావాలంటూ రాష్ట్రపతిని ఆహ్వానించారు. ఈ నెల 19 నుంచి 21 వరకు ఈ సదస్సు జరగనుంది. సదస్సును వీడియో లింక్ ద్వారా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. మరోవైపు ఈ సదస్సుకు శ్రీలంక ప్రధాని విక్రమసింఘే హాజరుకానున్నారు. నాస్కామ్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 150 మంది పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. 30 దేశాల నుంచి ఆహ్వానితులు విచ్చేయనున్నారు. ఈ సదస్సులో మొత్తం 50 సెషన్లు జరగనున్నాయి.