thieve: అమెరికాలో కాల్పుల కలకలం... భారతీయ అమెరికన్ మృతి!
- రెండు స్టోర్ లలో కాల్పులు జరిపిన లమర్ రషద్ నికోల్సన్
- తొలి స్టోర్ లో పంజిత్ సింగ్ పై కాల్పులు
- రెండో స్టోర్ లో పార్థీ పటేల్ పై కాల్పులు
అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. జార్జియా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్జియాలోని బర్నెట్ ఫెర్నీ రోడ్ లో గల హైటెక్ క్విక్ స్టాప్ స్టోర్ లోకి ఆగంతుకుడు తుపాకీతో ప్రవేశించాడు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే స్టోర్ లోని కౌంటర్ వద్ద నిల్చున్న పరంజిత్ సింగ్ పై కాల్పులు జరిపాడు. అక్కడి నుంచి పక్కనే ఉన్న మరో స్టోర్ లోకి వెళ్లి కౌంటర్ వద్ద నున్న క్లర్క్ పార్థీ పటేల్ పై కాల్పులు జరిపి, కౌంటర్ లో డబ్బు దొంగిలించాడు.
మొదటి స్టోర్ లో కాల్పుల్లో గాయపడ్డ పరంజిత్ సింగ్ అక్కడికక్కడే మృతిచెందగా, రెండో స్టోర్ లో తూటాగాయమైన పార్థీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దొంగతనం చేసి పారిపోతున్న ఆగంతుకుడ్ని పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. అతనిని లమర్ రషద్ నికోల్సన్ గా గుర్తించారు. నికోల్సన్ కు నేరచరిత్ర ఉందని, గతంలో దొంగతనం కేసులో జైలు శిక్షకూడా అనుభవించాడని వారు తెలిపారు.