Cricket: నాలుగో వన్డే: దక్షిణాఫ్రికా విజయ లక్ష్యం 290 పరుగులు
- శిఖర్ ధావన్ 109, విరాట్ కోహ్లీ 75, దోనీ 42 (నాటౌట్) పరుగులు
- దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా, ఎన్గిడిలకు రెండేసి వికెట్లు
- ఈ మ్యాచ్ భారత్ గెలిస్తే సిరీస్ కైవసం
జొహన్నెస్ బర్గ్ వేదికగా జరుగుతోన్న దక్షిణాఫ్రికా, భారత్ నాలుగో వన్డేలో టీమిండియా బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించడంతో.. భారత్ నిర్ణీత ఓవర్లకి ఏడు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో రోహిత్ శర్మ 5, శిఖర్ ధావన్ 109, విరాట్ కోహ్లీ 75, అజింక్యా రహానె 8, శ్రేయాస్ ఐయ్యర్ 18, మహేంద్ర సింగ్ ధోనీ 42 (నాటౌట్), హార్దిక్ పాండ్యా 9, భువనేశ్వర్ కుమార్ 5, కుల్దీప్ యాదవ్ 0 (నాటౌట్) చేశారు.
టీమిండియాకు ఎక్స్‌ట్రాల రూపంలో 18 పరుగులు లభించాయి. దీంతో దక్షిణాఫ్రికా ముందు 290 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా, ఎన్గిడిలకు రెండేసి వికెట్లు లభించగా, మార్కెల్, మోరిస్‌లకు తలో వికెట్ దక్కాయి.