maha shiva ratri: మల్లప్పకొండపై 2.25 లక్షల రుద్రాక్షలతో శివలింగం!
- 14 అడుగుల రుద్రాక్షల శివలింగం
- రుద్రాభిషేకానికి శివలింగం సిద్ధం
- 40 వేల మంది భక్తులు వస్తారని అంచనా
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలం మల్లప్పకొండపై వినూత్నంగా రుద్రాక్షల శివలింగం ఏర్పాటు చేశారు. 14 అడుగుల ఈ రుద్రాక్ష శివలింగాన్ని ఏర్పాటు చేసేందుకు సుమారు 2.25 లక్షల రుద్రాక్షలను వినియోగించారు.
మల్లప్పకొండపై ఏటా నిర్వహించే శివరాత్రి మహోత్సవానికి భారీ సంఖ్యలో వస్తుంటారని నిర్వాహకులు తెలిపారు. స్థానికులతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన సుమారు 40,000 మంది భక్తులు మల్లప్పకొండపై నిర్వహించే రుద్రాభిషేకంలో పాల్గొంటారని అంచనా వేస్తున్నట్టు వారు తెలిపారు.