Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కోడలిపై పార్శిల్ ద్వారా రసాయన దాడి ... హుటాహుటిన ఆసుపత్రికి!

  • డొనాల్డ్ ట్రంప్ జూనియర్ సతీమణి వానెస్సా
  • ఇంటికొచ్చిన పార్శిల్ తెరవగానే కళ్లు తిరిగి పడిపోయిన వానెస్సా
  • ఆమె తల్లి, మరో ఇద్దరు బంధువులు కూడా
  • ఆసుపత్రిలో చికిత్స - ప్రాణాపాయం లేదన్న వైద్యులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోడలు, డొనాల్డ్ ట్రంప్ జూనియర్ సతీమణి వానెస్సాపై రసాయన దాడి జరగడం కలకలం రేపింది. సోమవారం నాడు తన ఇంటికి వచ్చిన పార్శిల్ ను ఆమె తెరచి చూడగానే పౌడర్ ఎగసి పడగా, దీంతో ఆమె వెంటనే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వనెస్సాతో పాటు ఆమె తల్లి, ఇంట్లోనే ఉన్న ఇద్దరు బంధువులూ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించారు.

పౌడర్ మీద పడగానే వానెస్సా విపరీతమైన దగ్గు, తల తిరిగిన లక్షణాలు కనిపించడంతో ఇంట్లోనే ఉన్నవారు ఎమర్జెన్సీ నంబరుకు ఫోన్ చేశారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగుపడిందని అధికారులు తెలిపారు. ఆ పార్శిల్ లో ప్రాణాంతక కెమికల్స్ ఏమీ లేవని ల్యాబ్ రిపోర్టు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఆ పార్శిల్ ను ఎవరు పంపించారన్న విషయాన్ని తేల్చేందుకు ఎఫ్బీఐ రంగంలోకి దిగింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఎవరు పంపారన్న విషయమై చురుకుగా విచారణ జరుగుతోందని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News