amezon: ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తోన్న అమెజాన్
- అభివృద్ధి చెందుతున్న విభాగాల్లో ఉద్యోగుల సంఖ్యను పెంచే యోచన
- రిటైల్ వ్యాపారంలో పనిచేస్తోన్న పాత ఉద్యోగులను తొలగింపుతో సద్దుబాటు
- గతేడాది 1,30,000 మంది ఉద్యోగుల్ని చేర్చుకున్న అమెజాన్
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ అమెరికాలోని తమ సీటెల్ ప్రధాన కార్యాలయంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు తెలిసింది. 2017లో ఆ సంస్థ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,30,000 మంది ఉద్యోగుల్ని తీసుకుంది. అమెజాన్ డిజిటల్ ఎంటర్టైన్మెంట్, ఎకో డివైజెస్, వీడియో, వెబ్ సర్వీసెస్ క్లౌడ్ బిజినెస్ వంటి విభాగాల్లో కొత్తగా ఉద్యోగుల్ని నియమించాలని ఆ కంపెనీ భావిస్తోంది.
దీంతో పలు విభాగాల్లో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు చెప్పింది. తమ ప్రణాళికల్లో భాగంగా ఉద్యోగుల సంఖ్యలో సద్దుబాట్లు చేస్తున్నామని పేర్కొంది. బాగా అభివృద్ధి చెందుతున్న విభాగాల్లో ఉద్యోగుల సంఖ్యను పెంచి, రిటైల్ వ్యాపారంలో ఉద్యోగుల్ని తగ్గిస్తున్నట్లు చెప్పింది.