diabetis: మధుమేహులకు సమర్థవంతంగా పనిచేసే కొత్త ఔషధం!
- మధుమేహం చికిత్సలో ఉపయోగించే సరికొత్త ఇన్సులిన్ విడుదల
- చక్కెర స్థాయులను నియంత్రించడానికి ఉపయోగకరం
- ఔషధ తయారీ సంస్థ శానోఫై ప్రకటన
భారతీయుల్లో మధుమేహం ప్రధానమైన సమస్యగా తయారయిన విషయం తెలిసిందే. మధుమేహం బారిన పడుతోన్న ప్రజల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. కాగా, ప్రముఖ ఔషధ తయారీ సంస్థ శానోఫై మధుమేహ బాధితులకు ఓ శుభవార్త చెప్పింది. మధుమేహం చికిత్సలో ఉపయోగించే సరికొత్త ఇన్సులిన్ ను విడుదల చేసినట్లు పేర్కొంది. ఇది టైప్-1, టైప్-2 మధుమేహ బాధితుల్లో చక్కెర స్థాయులను నియంత్రించడానికి ఉపయోగపడుతుందని చెప్పింది.
వైద్యుల సూచనల మేరకు సోలోస్టార్పెన్ ద్వారా దీనిని వినియోగించవచ్చని, టౌజియోను విడుదల చేయడం ద్వారా శానోఫై ఔషధ శ్రేణిపై తాము మరింత నిబద్ధతతో ఉన్నట్లు గుర్తించవచ్చని శానోఫై ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.రాజారాం అన్నారు. ఇది తొలిసారి 2015లో అమెరికాలో ఆమోదం పొందగా, అనంతరం 65 దేశాలు ఈ ఔషధ విక్రయానికి అనుమతులు ఇచ్చాయి.