Revanth Reddy: కోదండరామ్ తో భేటీ అయిన రేవంత్ రెడ్డి
- శుభ కార్యానికి ఆహ్వానించిన రేవంత్
- త్వరలోనే రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్న కోదండరామ్
- ఈ నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత
తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ ను కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి కలిశారు. ఆయన నివాసానికి వెళ్లి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన నివాసంలో జరిగే శుభకార్యానికి రావాల్సిందిగా కోదండరామ్ ను ఆహ్వానించారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై కూడా వీరి మధ్య చర్చ జరిగింది.
త్వరలోనే కోదండరామ్ ఓ రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. వీరి భేటీకి సంబంధించిన విషయాన్ని రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా కూడా తెలిపారు. కోదండరామ్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యానని ఆయన ట్వీట్ చేశారు. భేటీకి సంబంధించిన ఫొటోను అప్ లోడ్ చేశారు.