gold: పెళ్లిళ్ల సీజన్ దగ్గరపడుతుండడంతో.. అమాంతం పెరిగిన బంగారం ధర
- ఈ రోజు పది గ్రాముల బంగారం ధర రూ.350 పెరిగి, రూ.31,650గా నమోదు
- రూ.720 పెరిగి, రూ.39,970కు చేరిన వెండి ధర
- గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర 0.27 శాతం పెరిగి ఔన్సు 1,354 డాలర్లుగా నమోదు
అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం, ఆభరణాల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు పెరిగిపోతుండడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ దగ్గరపడుతుండడమే ఇందుకు కారణమని విశ్లేషకులు అంటున్నారు. ఈ రోజు పది గ్రాముల బంగారం ధర అమాంతం రూ.350 పెరిగి, రూ.31,650గా నమోదైంది. మరోవైపు వెండి ధర కూడా పైకి ఎగిసింది. ఈ రోజు కిలో వెండి ధర రూ.720 పెరిగి, రూ.39,970కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరిగిపోవడమే ఇందుకు కారణం. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర 0.27 శాతం పెరిగి ఔన్సు 1,354 డాలర్లకు చేరింది.