Tollywood: వాళ్లిద్దరి పెళ్లయ్యాకే నా వివాహం: వరుణ్ తేజ్
- తొలిప్రేమ’ విజయంతో హ్యాపీమూడ్ లో వరుణ్
- ప్రభాస్, నితిన్ ల వివాహం అయిన తర్వాతే తాను పెళ్లి
- ప్రేమ, పెళ్లి గురించిన విషయాలకు సమయం లేదు
‘తొలిప్రేమ’ విజయంతో సంతోషంగా ఉన్న హీరో వరుణ్ తేజ్ ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పాడు. ప్రభాస్, నితిన్ ల వివాహం అయిన తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ప్రేమ, పెళ్లి గురించిన విషయాలకు సమయం లేదని, సినిమాలతోనే తన వివాహమైందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వరుణ్ వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా, త్వరలో అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రంలో వరుణ్ నటించనున్నాడు. ఘాజి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఈ కొత్త సినిమాకు దర్శకుడిగా వ్యవహరించనున్నారు.