tiger: దూసుకొచ్చిన చిరుతపులి.. భయంతో పరుగులు తీసిన ప్రజలు!
- రెండు రోజులుగా గ్రామంలోనే పులి
- ఫారెస్ట్ సిబ్బందికి కూడా చిక్కకుండా ముప్పుతిప్పలు పెట్టిస్తోన్న వైనం
- ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఆషియానా కాలనీలో భయం.. భయం
గ్రామంలోకి ప్రవేశించిన ఓ చిరుతపులి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. రెండు రోజులుగా ఆ పులి తమ గ్రామంలోనే తిరుగుతోందని ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఆషియానా కాలనీ వాసులు అంటున్నారు. ఆ చిరుతపులి ఫారెస్ట్ సిబ్బందికి కూడా దొరకకుండా తప్పించుకుంటోన్న తీరు మరింత ఆందోళన కలిగిస్తోంది. తాజాగా అది ఫారెస్ట్ సిబ్బందికి చిక్కినట్టే చిక్కి మళ్లీ తప్పించుకుంది.
ఓ చోట ఫారెస్ట్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి దానిని పట్టుకోవాలనుకున్నారు. ఆ వలలోకి ప్రవేశించినట్లే అనిపించిన చిరుత ఒక్కసారిగా ప్రజలపైకి దూసుకువచ్చినంత పని చేసింది. మీరూ చూడండి...