pnb: పీఎన్‌బీ కుంభకోణంలో కొనసాగుతోన్న సోదాలు.. ముంబయి బ్రాంచికి సీల్‌ వేసిన అధికారులు

  • కుటుంబంతో కలిసి విదేశాల‌కు చెక్కేసిన నీరవ్‌ మోదీ
  • నిన్న పీఎన్‌బీ ముంబయి బ్రాంచ్‌లో సీబీఐ సోదాలు 
  • 11 మంది కీల‌క అధికారులను ప్రశ్నిస్తోన్న అధికారులు

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో భారీ కుంభ‌కోణం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడు, వజ్రాభరణాల వ్యాపారి నీరవ్‌ మోదీ కుటుంబంతో కలిసి ఇప్పటికే విదేశాల‌కు చెక్కేశాడు. ఈ కుంభ‌కోణంపై విచార‌ణ జ‌రుపుతోన్న సీబీఐ అధికారులు పంజాబ్ నేష‌నల్ బ్యాంక్ ముంబయి బ్రాంచికి సీల్‌ వేశారు. ఇందుకు సంబంధించి పూర్తి స‌మాచారం అందాల్సి ఉంది. 

నిన్న సీబీఐ అధికారులు పీఎన్‌బీ ముంబయి బ్రాంచ్‌లో సోదాలు నిర్వహించారు. కాగా, నీరవ్ మోదీకి చెందిన కంపెనీలపై కూడా సీబీఐ విచార‌ణ కొన‌సాగిస్తోంది. ఆయ‌న కంపెనీలకు సంబంధించిన 11 మంది కీల‌క అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ కుంభ‌కోణంలో రిటైర్డ్ బ్యాంక్ అధికారి గోకుల్‌నాథ్‌ శెట్టి, మనోజ్‌ ఖారత్‌లపైనా విచారణ జరుపుతోంది.

  • Loading...

More Telugu News