High Court: హిందూయేతరులను కొనసాగించండి... అన్యమత ఉద్యోగుల వ్యవహారంపై టీటీడీకి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
- 45 మంది అన్యమత ఉద్యోగులను వివరణ కోరుతూ ఇటీవల టీటీడీ నోటీసులు
- హైకోర్టుని ఆశ్రయించిన ఉద్యోగులు
- తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వారిని ఉద్యోగాల్లో కొనసాగించాలి-హైకోర్టు
తిరుమల శ్రీవారి దేవస్థానంలో అన్యమతస్తులు ఉద్యోగాలు చేయడానికి వీల్లేదంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. 45 మంది అన్యమత ఉద్యోగులను వివరణ కోరుతూ ఇటీవల టీటీడీ నోటీసులు జారీ చేయగా, కొందరు ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. అన్యమతాల ఉద్యోగులను తొలగించాలని టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయంపై మండిపడ్డారు.
వారి పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. హిందూయేతరులను ఉద్యోగాల నుంచి తొలగించవద్దని టీటీడీకి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తమ నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు హిందూయేతరులను ఉద్యోగాల్లో కొనసాగించాలని ఆదేశించింది. అలాగే, టీటీడీ ఇచ్చిన సంజాయిషీ నోటీసులకు వివరణ ఇవ్వాలని ఉద్యోగులకు సూచించింది. ఈ సంజాయిషీ నోటీసుల చట్టబద్ధతను తాము పరిశీలిస్తామని తెలిపింది.