redmi note 5: మూడు నిమిషాల్లోనే మూడు లక్షలు అమ్ముడుపోయిన రెడ్ మీ నోట్ 5 మోడళ్లు
- నిన్న మధ్యాహ్నం ముగిసిన ఫ్లాష్ సేల్
- భారత్ లో ఇదే అతిపెద్ద ఫ్లాష్ సేల్ అని కంపెనీ ప్రకటన
- తదుపరి విక్రయం ఈ నెల 28న
షియోమీ రెడ్ మీ 5, 5 ప్రో స్మార్ట్ ఫోన్లు తొలి ఫ్లాష్ సేల్ లో హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. మూడు లక్షల ఫోన్లను అభిమానులు 3 నిమిషాల్లోనే ఎగరేసుకుపోయారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్, రెడ్ మీ వెబ్ సైట్లలో ఈ ఫ్లాష్ సేల్ జరిగింది. భారత్ లో ఇదే అతిపెద్ద ప్లాష్ సేల్ అని, మూడు నిమిషాల్లోనే మూడు లక్షల ఫోన్లు అమ్ముడయ్యాయని కంపెనీ ప్రకటించింది.
ఇక ఎంఐ టీవీ 4 అందుబాటులో ఉంచిన టీవీ సెట్లన్నీ పది నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి. రెండో విడత ఈ ఫోన్ల ఫ్లాష్ సేల్ ఈ నెల 28న జరగనుంది. వచ్చే బుధవారం 28న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లాష్ సేల్ ఉంటుందని షియోమీ కంపెనీ భారత విభాగం ఎండీ మనుకుమార్ జైన్ తెలిపారు. వారానికోసారి ఫ్లాష్ సేల్ నిర్వహించడం షియోమీ మార్కెటింగ్ విధానంలో భాగం.