Chandrababu: పోరాట పంథాను ఎంచుకోవడానికి కారణం ఇదే: చంద్రబాబు
- విభజన హామీలను నెరవేర్చనందుకే పోరాట పంథా
- నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో చూశా
- ఐదు నదులను అనుసంధానిస్తాం
విభజన చట్టంలో ఉన్న అన్నింటినీ సాధించేవరకు విశ్రమించబోమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందులో రెండో ఆలోచన లేదని అన్నారు. విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చనందునే... తాము పోరాట పంథాను ఎంచుకున్నామని తెలిపారు. ఈ నెల 27 నాటికి తాను రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్లు అవుతోందని... తన రాజకీయ జీవితంలో ఎన్నో చూశానని చెప్పారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతూనే, అభివృద్ధిలో దూసుకెళుతున్నామని అన్నారు. ఐదు నదులను అనుసంధానం చేసి, మహా సంగమాన్ని ఏర్పాటు చేస్తామని... ఇది సాకారమైతే రాష్ట్రంలో కరవు అనేది ఉండదని చెప్పారు.