space x: భూమిని రోజుకు 15 సార్లు చుట్టేసే ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టిన ఫాల్కన్-9

  • ఫాల్కన్-9 తో మూడు ఉపగ్రహాలను రోదసీలో ప్రవేశపెట్టిన స్పేస్ ఎక్స్ సంస్థ
  • మూడు ఉపగ్రహాల్లో ఒకటి స్పెయిన్ కు చెందిన పీఏజెడ్
  • పీఏజెడ్ లోని అధునాతన రాడార్ తో వేగవంతమైన, సమర్థవంతమైన ఇంటర్నెట్ సేవలు

భూమిని రోజుకి 15 సార్లు చుట్టి వచ్చే పీఏజెడ్ ఉపగ్రహాన్ని స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన పునర్వినియోగ ఫాల్కన్-9 రాకెట్ అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. స్పెయిన్ పీఏజెడ్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టేందుకు స్పేస్ ఎక్స్ తో ఒప్పందం చేసుకుంది. అంతరిక్షం నుంచి అంతర్జాతీయ బ్రాడ్‌ బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సేవలను మరింత వేగంగా, సమర్థవంతంగా అందించేందుకు పీఏజెడ్ ఉపగ్రహంలోని అధునాతన రాడార్ పరికరం ఉపయోగపడుతుంది.

పీఏజెడ్ ఉపగ్రహంతో పాటు ఫాల్కన్-9 స్పేస్ ఎక్స్ కు చెందిన మరో రెండు ప్రయోగాత్మక ఉపగ్రహాలను రోదసీలో ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగాన్ని స్పేస్ ఎక్స్ కాలిఫోర్నియాలోని వాండెన్‌ బర్గ్‌ వైమానిక స్థావరం నుంచి నిర్వహించింది. ప్రయోగం నిర్వహించిన 11 నిమిషాలకు పీఏజెడ్ ఉపగ్రహాన్ని ఫాల్కన్‌-9 రాకెట్‌ కక్ష్యలో ప్రవేశపెట్టిందని స్పేస్ ఎక్స్ తెలిపింది. ఈ పీఏజెడ్ ఉపగ్రహం 24 గంటల్లో ప్రపంచం మొత్తాన్ని కవర్ చేస్తుందని, వాణిజ్య ప్రభుత్వ అవసరాలను తీరుస్తుందని స్పేస్ ఎక్స్ సంస్థ వెల్లడించింది. 

  • Loading...

More Telugu News