sridevi: శ్రీదేవి చనిపోవడం ఏమిటండీ... షాక్ నుంచి కోలుకోలేకపోతున్నా!: కోదండరామిరెడ్డి

  • పొద్దున్నే షాకింగ్ వార్త విన్నా
  • నమ్మలేకపోతున్నా
  • దేవుడు మంచి వ్యక్తులను తీసుకెళ్లిపోతుంటాడు

శ్రీదేవి మరణవార్త మామూలు షాక్ కాదని... తన జీవితంలోనే అతి పెద్ద షాక్ అని ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి చెప్పారు. శ్రీదేవితో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందని గుర్తు చేసుకున్నారు. తనపై శ్రీదేవికి ఎంతో గౌరవం ఉందని చెప్పారు. శ్రీదేవి చనిపోవడం ఏమిటండీ? అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పొద్దున్నే షాకింగ్ న్యూస్ విన్నానని... శ్రీదేవి చనిపోయిందని తనకు చెబితే... ఏ శ్రీదేవి అని అడిగానని చెప్పారు. మన శ్రీదేవేనండి అని చెబితే... చాలా సేపు నమ్మలేక పోయానని అన్నారు.

మా కంటే చాలా చిన్న అమ్మాయి అయిన శ్రీదేవి చనిపోవడం చాలా బాధాకరమని చెప్పారు. ఎప్పుడూ నవ్వుతూ, ఆనందంగా ఉండే శ్రీదేవి చనిపోవడం నమ్మలేకపోతున్నానని, షాక్ నుంచి కోలుకోలేకపోతున్నానని చెప్పారు. దేవుడు కొన్నిసార్లు ఇలాంటి మంచి వ్యక్తులను తీసుకెళ్లిపోతుంటాడని తెలిపాడు. శ్రీదేవి అద్భుతమైన నటి అని కొనియాడారు. ఎలాంటి పాత్రనైనా అలవోకగా పోషించగల సత్తా శ్రీదేవిదని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎన్నో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకుందని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. 

  • Loading...

More Telugu News