Sridevi: శ్రీదేవి మృతదేహాన్ని అప్పగించడంలో తీవ్ర జాప్యం.. ఇంకా దుబాయ్ ఆసుపత్రిలోనే భౌతికకాయం!
- 20 గంటలవుతున్నా ఇంకా దుబాయ్ ఆసుపత్రిలోనే శ్రీదేవి భౌతిక కాయం
- వైద్య పరీక్షల పేరుతో కాలయాపన చేస్తోన్న దుబాయ్ వైద్యులు
- మరి కొన్ని పరీక్షలు చేయాలంటున్న వైద్యులు
గుండెపోటుతో మృతి చెందిన శ్రీదేవి భౌతికకాయం ఈ రోజు రాత్రి 8 గంటలకు ముంబయి చేరుకోనుందని అందరూ భావించిన విషయం తెలిసిందే. శ్రీదేవి భౌతికకాయాన్ని పోస్టు మార్టం నిమిత్తం దుబాయ్ లోని ఒక ఆసుపత్రికి తరలించి 20 గంటలు అవుతున్నా, ఇంకా ఆ ఆసుపత్రిలోనే ఆమె భౌతికకాయం ఉంది. శ్రీదేవి భౌతికకాయానికి మరికొన్ని పరీక్షలు చేయాల్సి ఉందని దుబాయ్ వైద్యులు అంటున్నారు.
అయితే, వైద్య పరీక్షల పేరుతో కాలయాపన చేస్తున్నారంటూ దుబాయ్ వైద్యులపై విమర్శలు వస్తున్నాయి. శవపరీక్ష తరువాత శ్రీదేవి మృతదేహాన్ని ముహైస్నా ఎంబాల్మింగ్ సెంటర్కు తరలించనున్నారు. అనంతరం అక్కడి నుంచి ప్రైవేట్ జెట్లో ముంబయికి తీసుకువస్తారు.